Friday, 3 August 2012

ఉప్పు తిన్నవాడు

ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగక తప్పదు! తప్పు చేసినవాడు దండన పొందక తప్పదు! పెద్దవాళ్ళు చెప్పే మాటలు పొల్లు పోవు! నవ్వుతూ ఈ రోజు చేసే తప్పులకు ఏడుస్తూ రేపు అనుభవించాలి! నేరం, పాపం చీకట్లో చేసి చేతులు కడుక్కున్నా, వెలుతురులో వాటి నీడలు వెంటాడక మానవ్! ఒకవేళ ఇప్పుడు వదిలిపెట్టినా.. రానున్న రోజుల్లో శిక్షించి గతకాలపు పాపాలను గుర్తుచేసే కఠినత్వం భగవంతుడు నేర్వకపోతే మనిషికి భయముంటుందా? దాదాపు 25 ఏళ్ళ క్రితం, వయసు, పదవి, పొగరు ఎక్సెట్రా పుష్కలంగా ఉన్న ఒక మహానుభావుడు కన్నుమిన్ను కానక తప్పులు చేశాడు! నైతిక విలువలకు మంగళం పాడి ఇష్టారాజ్యం గా తిరిగి, మొత్తానికి తన భాష లో లైఫ్ ను ఎంజాయ్ చేశాడు! మరి భార్యామణి జీతం, గీతం, పరపతి, పదవి చాలనుకుందేమో! ఎప్పుడూ మొగుడ్ని పల్లెత్తుమాటనలేదు పరమసాధ్వీలలామ! కాలం తనపని తాను చేసుకుపోతూ ఇక్కడొచ్చి ఆగింది! తండ్రి గారి తప్పులకు దేవుడి లెక్కలు మొదలయ్యాయి! సదరు గొప్ప మనిషి సంతానం జీవితం లో సుఖం శూన్యం! నేస్తం!ఇదంతా తప్పు కు శిక్ష గా భావిస్తే మరి.. ఈ విషయం మనకు తెలిసినంతా స్పష్టంగా తప్పుచేసినవాళ్ళు గ్రహించారా?

No comments: