Wednesday, 8 August 2012

భావేంద్రజాలం

సముద్రాన్ని పుక్కిట్లో బంధించగలమా.. ఆకాశాన్ని గుప్పిట్లో బిగించగలమా… ఉవ్వెత్తునా ఎగసిపడే భావతరంగాలను నిరోధించగలమా.. అవధిలేని హృది వినువీధిని– అక్షర నక్షత్రాల్లోనే ప్రకటించగలమా… అనుభూతుల స్వేఛ్చావిహంగాలను- పద పంజరాల్లో ప్రదర్శించగలమా… కంటికి కనిపించని కాంతిలాగా కర్ణభేరి గ్రహించని శబ్దాల్లాగా భాషకందని భావాలూ…..! నిత్యనూతన అనుభవాలూ…!!

No comments: