Thursday, 23 August 2012

మన భారతావని ….

అందరు కలసికట్టుగా నియంత్రించాలి జనాభాని అప్పుడు వీలవుతుంది సాథించడానికి ప్రగతిని దేశంలొ అరికట్టాలి ప్రాణాంతక వ్యాథిని అందుకు మేల్కొలపాలి మానవజాతిని మనుషులలో అణచాలి కులమతాల చిచ్చుని మనసులలో వెలిగించాలి మానవత్వపు ప్రమిదని అందరకి అందించాలి చదువుని వాళ్ళ జీవితాలలొ నింపాలి వెలుగుని చిన్నారులు అనుసరించాలి పెద్దల బాటని వాళ్ళ మాటలలో నుంచి పొందాలి స్పూర్తిని గౌరవించాలి మనదేశ సంస్కతిని ఆచరించాలి మనదేశ సాంప్రదాయాలని సంపాదించాలి పరభాషా జ్ఞానాన్ని విడనాడాలి పరదేశ వ్యామోహాన్ని క్రీడలలొ చూపించాలి మన ప్రతిభని అన్ని దేశాలకు చాటాలి మనదేశ ఖ్యాతిని ప్రజలందరూ అవలంబించాలి నీతిని సమాజంలో తుంచాలి అవినీతిని ప్రతిఒక్కరూ చాటాలి మనమంతా ఒక్కటని అప్పుడు నిజంగా వెలిగిపోతుంది మన భారతావని……. ఈ రోజు నుంచి మొదలుపెడదాం…. ………..

No comments: