Saturday, 25 August 2012

ఒకవేళ

జ్వరం సోకినఈ రాత్రుళ్ళలో నీ నుదిటిపై చల్లటి వర్షమై ఓ అరచేయి దీపం వెలిగించిన వెచ్చదనంతో నీ చీకటి కళ్ళని నెమ్మదిగా ఒద్దికగా తాకితే రేపు ఉదయం తడిని విదుల్చుకునే రెక్కలతో ఎగిరేపోతాయి గూళ్ళలోంచి ఆ పక్షులు, కొద్దిగా ఉపశమించి చల్లబడిన నీ శరీరంలోంచి మంటను రాజేసిన వంటింట్లోకి ఓ తేనీటి పాత్రలో మరిగే ఆ సూర్యజలం వద్దకు- సరే, సరే కృతజ్ఞతలు చెప్పుకోవాలి యిక నీకే ఎప్పటికైనా పూలు వడలి అలసి ఆగిన చోట నువ్వు వికసించిన కాలానికీ ఒక అనామక పద స్నేహానికీ-!

No comments: