Saturday, 25 August 2012

స్మృతిదీపం

సరళమైన నీటి చెలమలో ప్రసన్నమైన వదనంతో ఎవరో వెలిగించిన స్మృతి ప్రమిదెవు నువ్వు: రాత్రిపూట వీచే సన్నటి గాలిలో, ఒక దిగులులో ఆ దీపపు కాంతిలో నీ నీటిలోతుల్లో నా ప్రతిబింబం చూసుకోడానికైనా నీ అరచేతుల్లో నీళ్ళు అందుకుని నా ముఖం కడుక్కోవడానికైనా, ఆఖరకు మంటని తాకడానికైనా దీపం ఆర్పి వేయడానికైనా, నేను ఎవరు? నువ్వెవరు?

No comments: