Saturday, 25 August 2012

అవనతం

రాత్రి అలలలోంచి ఒక ముఖం తేలి నిన్ను మృత్యు పెదాలతో తాకిన వేళ వెడతావు నువ్వు ఇల్లు కాని ఇంటికి నెత్తురు పాదాలతో ఓ పూలగుచ్చంతో రాత్రిలోని చీకటిగా మారి ఎదురుచూసే తన నయన సమాదులపై ఉంచేందుకూ నీకై నువ్వు రెండు నిమిషాలు మౌనం పాటించి నిశ్శబ్ధంగా అవనతమయ్యేందుకూ-

No comments: