Saturday, 25 August 2012

అస్పష్టత

ఆ నీళ్ళకళ్ళని తాకి ఈ గాలి పొదుగులో తల దూర్చి కూర్చుంటావు ఊరకనే ఎందుకో ఆకులపై సూర్యుని రాత్రి గీతలు మెరిసి చెమ్మగిల్లిన ఓ అరచేయి నిను తాకితే చితుల ధూపం రేగిన విలాప మధ్యాహ్నాన- యిలా చూడు- నా శ్వాస ఓపలేని కన్నీరై నీలోంచి ఎలా ఒలికి పొయిందో. నీ దూరం ఓ సమాధియై ఎలా నింపాదిగా దగ్గరయ్యిందో- ఇంతకూ, అంత తేలికగా ఈ శ్వేత దీప ద్వీపదినంలో యింత నల్లని కాంతిని వెలిగించి వెనుదిరిగి చూడకనే వెళ్లిపోయింది ఎవరు?

No comments: