తడి ఆరని నా కన్నులు ఆర్ధ్రతగా చూసే వేళలో
నాకు ఎదురైంది ఒక తారక నీ రూపంలో
నీవెవరు అని అడుగకుండా నేనుండిపోయాను ఉత్సాహంలో
పేరు పెట్టని ఈ బంధం అల్లుకుంది నా మనసులో
నా గుండెల్లో కొత్త సడి మ్రోగింది ఆనందరాగంలో
నీతో ఎన్నో రోజుల సమయం గడిచింది నిముషాల్లో
ఇదేదో చిరుజల్లేమోనని భ్రమపడ్డాను
ఇంతలో జడివానలా మారిన ఊపుకి ఉలిక్కిపడ్డాను
స్నేహమనే చిరుజల్లు జడివనలా
చిలికి చిలికి గాలివానలా మారటం
నేను ప్రేమసంద్రంలో తలమునకలవటం గమనించి ఆశ్చర్యపోయాను
ఆ కడలిలో ఎగసే కెరటాలు నా ఉఛ్వాశమైతే
అల చేరే నీ చూపుతీరం నాకు నిశ్వాశమైంది
సంద్రపు ఆటుపోటుల్లొ బతికేస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తూ...
No comments:
Post a Comment