Wednesday, 8 August 2012

కొత్త విత్తనం

రక్తంతో తడిసిన అక్షరాలు చరిత్ర పుటల్లో మూలుగు తున్నపుడు ఎర్రటి మరకలతో తెల తెల పువ్వులు వెల వెల పోతున్నపుడు దాగుతుందా నిజం తెలియక చేసిన తప్పు తీగలా పుడుతుందని తెలిసినదాన్నంతా అల్లుకుపోతుందని గతమంతా ఇంతేనని అనుకుందామా ? జరిగినదాంట్లో మనకేం ఒరిగిందని కుర్చున్దామా ? మర్రి ఊడలు వేర్లవుతాయి మరకలు కూడా చెరగని గురుతులవుతాయి మార్చే మొలకలవుతాయి గతం సంగతి గాలికి తెలియదా బాధ పడి ఆగిపోతే బ్రతుకు ఉంటుందా అవగతం కాని గతాన్ని అవగాహన చేసుకుంటూ కదిలిపోతుంది గాలి కాలాలను మార్చుకుంటూ ఎండిన విత్తనమే కదా మొలకేత్తేది

No comments: