Saturday, 25 August 2012

నిండు పున్నమిన

నిండు పున్నమిన నింగిన విరిసే పాలవెన్నెలలే పాలవెన్నెలకు పోటీగ యిలలో పూసే తెల్లని పారిజాతాలే చెంపకు చారెడు కళ్ళలా విరిసిన పారిజాతాలు చెట్టుకే అందం తెచ్చే ఊరిలోకి వచ్చిపోయేవారిని పాలనవ్వుల పారిజాతాల పరిమళాలు పలకరించే ప్రభాతవేళ చెలులతో చేరి పారిజాతములునేరి దోసిళ్ళలో చూసి మైమరచే పుస్తకాల పేజీలలో యెంచిన కొన్నిపారిజాత పూలను గుర్తుగా దాచి సంబరపడితి గతించిన సుకాలపు తీపి గుర్తులల్లే పేజీలకు అంటిన ఎండిన పారిజాతాలే మిగిలే సాక్షిగా సతిసత్యభామ గర్వభంగ యితిహాసమునకు పారిజాతమే పువ్వే అంకురమయ్యేగ ఇటువంటి యిహపరలోక ప్రహసనం గల్గిన పారిజాత పూలంటే నాకు మిక్కిలి ప్రేమగా

No comments: