అరమరికలు లేని బంధం కోసం మూడు ముళ్ళ తో ఏకమయ్యాం
అమ్మా నాన్నలమయ్యాక కూడా అర్ధరహిత అహంకారాలతో ఆభిజాత్యాలతో స్వయంకృతాపరాధాలుగా మూడు ముళ్ళను మలుచుకున్నాం
ఇంకేముంది ఒకరి మాట ఒకరం వినం కానీ మన మాటలందరూ వింటున్నారు
పసివాడికి బాల్య మాధుర్యాన్ని మిగలనీయని మన మూర్ఖత్వం
సూర్యోదయాన్ని పడమటింటికంపుతున్న నిశితేజమై కబళిస్తోంది...
ఇకనైనా నీవు నేను అను వాదనలనాపి ఎదుగుదాం
నువ్వే నేనైన ఏకత్వంతో పాపడికి బంగరు భవితనిద్దాం...
No comments:
Post a Comment