Saturday, 25 August 2012

అతిశయం

ఎవరి పిడికిలిలోనో చిక్కుకుని ఎటూ తప్పించుకోలేక విలవిలలాడుతుంది ఈ నీ హృదయపు తేనెపిట్ట. నిజమే ఫిరోజ్, రాత్రుళ్ళకు నల్లని రంగు వేసి పగళ్ళకు వెలుతురుని కట్టేదీ చుక్కలని చక్కగా అల్లి ఈ భూమిని అలంకరించేదీ ఆకులకు వాన చుక్కలని అంటించి సంతోష పడేదీ సూర్య చంద్రుల దీపాలకు తన దేహ తైలం అర్పించి వెలిగించి రాత్రింబవళ్ళూ మురిసిపోయేది తనేననీ తనలో తాను ముడుచుకుపోయిన ఈ లోకపు తాబేలుకు నువ్వు ఎలా చూపించగలవు? ఎం చెప్పగలవు? ఫిరోజ్, చూడు తను జ్ఞాపకం వచ్చి నీ ముఖం ఈ అర్థరాత్రిలో ఎలా ఓ ఇంద్రధనుస్సులా వికసించి సీతాకోకచిలుకై కమ్ముకున్న మబ్బుల పూదోటలో ఎంత అతిశయంతో చక్కర్లు కొడుతుందో!

No comments: