Saturday, 25 August 2012

కానివ్వు ఇలాగే

నెలవంకని మోసుకుని నల్లని చీమలు నీ నిదురలోకి నడిచే రాత్రి అయ్యింది-. యిక చూడు కరివేపాకు వనాలు వీచే కిటికీలు తెరచి ఉంచిన మన గదిలో రెండు మంచాలు పరిచాను దూరం దూరంగా. యిక ఈ రాత్రంతా ఇరు మంచాల పైనా ఒకే సమయంలో పరుండలేక ఓ ఆరేళ్ళ పిల్లవాడు ఎందుకో చీకటిలో గులాబీ నక్షత్రాల రెక్కలని విదిల్చే ఆ నల్లని కాంతి సీతాకోకచిలుకలనే తన తెల్లటి చేతులతో అనుసరిస్తాడు. సరేలే. ఒక రాత్రి కూలిపోతే పక్షులు రాలిపోతే - నీకూ నాకూ ఏం సంబంధం? కానివ్వు ఇలాగే!

No comments: