Friday, 3 August 2012

ఎవరూ అడగనిది

నీ అద్దంలో ఉందొక నలుపు సరస్సు- వలలతో వస్తారిక జాలరులు రాత్రికి మౌనమృగ కర్మాగారపు దేహాలై నీ నీలి కనుల గృహానికి! ఆహోయ్ యిక కరిగిన అద్దంలో ముద్ర పడిన పెదాలు ఏ పదాలు ఉచ్చరించాయో ఎవరికి తెలుసు? వెళ్ళు చెల్లెమ్మా వెళ్ళు దారిని దోచిన పవిత్రతే నువ్వు నమ్మకూడని ఒక ఆత్మనిందా నేరం- యిక ఈ రాత్రికి నువ్వు నీ దర్పణంలో నిదురించావో లేదో ఎవరూ అడగరు!

No comments: