Tuesday, 7 August 2012
ఆటో లో పోతున్నాను
ఆటో లో పోతున్నాను. ట్రాఫ్ఫిక్ జాం. బండి ఆగిపోయింది.
చుట్టూ చూస్తున్నాను. పక్కనే మోపెడ్ మీద ఫామిలీ.
ముందు భర్త, వెనక భార్య, అతడి ముందు 3 ఎళ్ళ కుర్రాడు.
ఆమె చేతిలో 6 నెలల పసిపాప. చాలా ధైర్యంగా చుట్టూ చూస్తూ..
కిలకిల నవ్వ్బుతోంది చక్కిలిగింతలు పెట్టినట్టు. తల్లి ఆ నవ్వుల్ని..
ఎంత ఎంజాయ్ చేస్తూందో.. ఆమె మొహం లో ఆనందం చెప్తోంది.
చిట్టి తల్లి ఏం చూత్తొంది.. కార్లు చూత్తొందా?? ఆటోలు చూత్తొందా..
అంటూ అది రోడ్డన్నది కూడా మర్చి పోయి కూతుర్ని ముద్దు చేస్తోంది.
ఇక ముందు తండ్రి కొడుకులు, నాన్నా! ఐస్ క్రీం తిందామా? ఓ యస్..
నాన్నా! మొక్కజొన్నకంకి..వెళ్ళేప్పుడు కొందాం, నాన్నా మనక్కారెప్పుడొస్తుంది..
నువ్ బాగా చదువుకుని పెద్దయ్యాక..కొందాం. వాళ్ళకి అది నడిరోడ్డనిపించడమే లేదు.
నాకు అప్రస్తుతమైనా ఒక విషయం గుర్తొచ్చింది. ఒక ఫామిలీ. సాఫ్ట్ వేర్ జాబ్.
ఏడాదికి 30 లక్షలు జీతం, పెద్ద ఇల్లు, కారు, బాంకు బాలెన్సు, దర్జా..
పెళ్ళి ఐ 10 ఏళ్ళు దాటింది. పిల్లలు లేరు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడూ..
శ్రావ్యమైన సంగీతం వినపడుతోంటుంది. ఇల్లు అద్దంలా అన్ని సౌకర్యాలతో..
మెరుస్తోంటుంది. కానీ పసిపిల్ల నవ్వులు, ఏడుపులు వినపడని నిశ్శబ్దం..
వాతావరణాన్ని కాదు గుండె ని కోస్తు ఉంటుంది.ఒక శూన్యం ఆ శుభ్రత్ర నిండా!
ఎందుకు దేవుడు ఒకచోట ఇచ్చింది ఇంకొకచోట ఇవ్వడు నేస్తం?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment