Saturday, 25 August 2012

వాగ్ధానం

నీ పదం నా సత్యం కాలేదు, నేను కాంచే ఉత్సవం నీకు వాగ్ధానం కాలేదు మొహసింతో, మనమందరమూ హృదయాలలో ఒక సమాధినీ భుజాలపై వారసత్వంగా వచ్చిన ఒక శిలువనీ మోసుకు తిరుగుతున్న వాళ్ళమే. శిలువవేయబడి ఈ భూమినీ మన అస్తిత్వాలనీ ఒక స్వరరహిత తరంగంలో ముంచివేసే ఆ తపన ఇక్కడిది కాదు. దిగులు,మొహసింతో, ఎదురుచూసే మన కళ్ళని కమ్ముకునే ఆ దిగులుపూరితమైన దిగులూ ప్రతిధ్వనీ ఏదీ లేక మన హృదయాలలోంచి దూసుకువచ్చే ఆ నిశ్శబ్ద ఆక్రందనా అవి మనకు చెందవు మొహసింతో, మన పిల్లలలా అవి మన ద్వారా వస్తాయి కాని మనకు చెందవు . నేను దిగులుగా ఉన్నానా? నాకు తెలీదు . నేను మతిస్థిమితం లేని వాడినా? అది నాకు తెలుసు . ఇక మనకు మిగిలిన శరణాలయం అంటావా? మొహసింతో, ఈ జీవించడంలో మరణించు .

No comments: