Saturday, 25 August 2012

కూర్చుందాం

కొడవలైన నెలవంక అంచున అలసి వాలిన నీ శిరస్సును తాకలేదా ఎవరైనా ఈ పూట? చింతించకు! ఎన్నో రాళ్ళను ఏరుకుని వచ్చాను నేను మన కొరకు- యిక రాత్రంతా నింపాదిగా అడుగంటిన ఈ కనుల కుండల్లోకి ఆ రాతి పూలను మన వేళ్ళ మధ్య నుంచి జాగ్రత్తగా దొర్లించుకుంటూ నిండి, ఒలికే కన్నీటిని తాగుతూ కూర్చుందాం పరస్పరం చెమ్మలేని ఈ నలుపు రాత్రంతా నా చేతుల్లోంచి నువ్వూ నీ చేతుల్లోంచి నేనూనూ-

No comments: