Wednesday, 8 August 2012

గుండె సవ్వడి...

ఎగిరే అలలపై వెన్నెల నురుగు , అందుకోవాలని తీరాన నా పరుగు , నీ ఎదురు చూపుల నిశ్సబ్దపు సడి , నన్ను వెంటాడుతున్న కలల ఒరవడి అలసటలో ఎరుపెక్కిన పడమటి సూరీడు , చీకటి చప్పట్లలో నింగిన నెలరేడు , గదిలో నీ గాజుల సవ్వడి ,నా మదిలో తీయని ఊహల రాపిడి నిండు కొలనులో కలువలు , ప్రకృతి రాసిన కవనాలు పానుపు పై తన పరువాల సవ్వడి , నా దరి చేర్చుకోనా తనువంతా ముద్దాడి ...వర్మ

No comments: