సాగాలి పయనం.....
చీకటి లోయ నుండి వెలుగు శిఖరాల వైపుకి
అసంతృప్తి ఆకలి నుండి మనసు నింపే తృప్తి వైపుకి
క్రోధపు సంద్రం నుండి శాంతి తీరం వైపుకి
నిరాశ శూన్యం నుండి ఆశా ప్రపంచం వైపుకి
అహంకారపు అంతఃపురం నుండి మమకారం నిండిన మన్ను వైపుకి
కృత్రిమమైన అలంకారాల నుండి సహజ సౌందర్యం వైపుకి
దాస్యపు శృంఖలాల నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వైపుకి
"నేను" అనే చిటారు కొమ్మ నుండి "నిగర్వపు" వేళ్ళ మూలల వైపుకి !!!
No comments:
Post a Comment