Thursday, 23 August 2012

సంచారమే

"..
జీవన ప్రయాణమైన చోట ఇక ఈ దేహానికి సాంత్వన ఎక్కడ..? అలుపు సొలుపు లేకుండా సాగుతున్న ఈ గమనం ... ఇంకెక్కడికో పయనం పలాయనం చిత్తగించకుండా సాగి పోవటమే ముందున్న సవాలు అంతా మార్కెట్ మయమైన తరుణంలో తోడు ఉండేది ఎవరు సాహచర్యం పంచేది ఎవ్వరు నా అనుకున్న వాళ్ళు ..మనతో పాటే ముందుకు నడిచిన వాళ్ళు ఎవరికి వారు ..ఎప్పుడో ఒకప్పుడు విడి పోవాల్సిందే కదా ఈర్ష్యలు...విద్వేషాలు ... కోపాలు ...దౌర్జన్యాలు కనురెప్ప మూసే లోగా కాలం భళ్ళున మన గుండెల మీద కోలుకోలేని గాయాన్ని చేస్తుంది ప్రతి సమయంలో పెట్టే పరీక్ష అడుగులు వేయనీకుండా చేస్తుంది అందరం జీవిస్తాం .. అలా ఉన్నట్టు నటిస్తాము తప్పదు ..పూట గడవాలంటే ఎక్కడో ఒక చోట సర్దుకు పోవాల్సిందే లేకపోతే ..ఈ లోకపు కీకారణ్యంలో ప్రేమ నింపుకున్న హృదయాలకు చోటు ఎక్కడ దొరుకుతుంది ..? కోరికలను జయించిన వాళ్ళే యోగులు ప్రపంచాన్ని వదిలివేసిన వాళ్ళు సన్యాసులు బతుకు మర్మాన్ని ఎరిగిన వాళ్ళు పకీర్లు ఇప్పుడు ...ప్రశాంతంగా నిదుర పోవాలని ఉంది మసీదుల్లో ..దర్గాలల్లో హాయిగా ధ్యానంలో మునిగి పోవాలని ఉంది సేదదీరాలని ఉంది .."

No comments: