Saturday, 25 August 2012

ఆవలివైపు

పావురాలు ఉండే నీ కళ్ళల్లో రెండు గుడ్లు దాచుకున్నాను నేను. (అవి నా రెండు చేతులు అనే అనుకో ప్రస్థుతానికి. కానీ...) వెలిసిన నీ శరీరంలో వాన శ్వాస ఊదిన ఒక ఇంద్రధనుస్సు. అ/నిజం నువ్వు పొదిగిన ఇళ్ళల్లో పిల్లలెవరూ లేరు దాగి ఇపుడు. పర, పరా వర్తనం చెంది, వాళ్ళ హృదయం కాంతి తీగలై సమాధి అయ్యింది యిక్కడే. నువ్వు చూసే ఈ తెరపైనే! ఎవరు చెప్పగలరు అసలు నువ్వున్నావో లేక ఒక ప్రతి/బింబాన్ని అనేక వలయాలుగా పూజిస్తున్నామో? సరే ఉరితాళ్ళు ఉండే నీ కళ్ళల్లో ఇద్దరిని దాచుకున్నావు నువ్వు. యిక కాంతి శాంతి ఎక్కడా రాగిణీ-? ఓం తత్సత్! నిన్ను తాకి నిన్ను కోరీ పురుషులు అనాధలై దేహార్తులై శరణార్ధులై ప్రధమ పాపపు పవిత్ర శోకితులై చచ్చిపోయేదీ ఇకిక్కడే! తాగిపో నిండుగా ఈ దేహపాత్రని. దేహ పాత్రా ధారినీ.

No comments: