మధువు వలె గంజాయి వలె
పూలవనం వలె తుంపర వలె
చీకట్లో వెలిగించిన దీపం వలె
రాత్రిలో వీచిన వెన్నెల వలె
వడలిన ముఖాన్ని తాకిన
ఒక మెత్తని చిరు గాలి వలె
చల్లటి మట్టి కుండ వలె
తెల్లని మెతుకుల వలె
పెదాలకు తల్లి అందించిన స్థన్యం వలె
మధువు వలె మాదక ద్రవ్యం వలె
ఒక గూడు వలె
ఒక సౌఖ్యం వలె
పొదివి పుచ్చుకునే
చలిమంట లాంటి
బాహువుల వలె
నేరం వలె శాపం వలె
ఎవరో అనామకంగా ఇచ్చిన
ఓ ప్రార్ధనా దీవెన వలె
మధువ వలె గంజాయి వలె
శ్వాస వలె భాష వలె ఓ
పాపం వలె పుణ్యం వలె
ఓ మృత్యు స్వాంతన వలె
యిలా నువ్వు అలవాటైతే
యిక ఎలా నేను?
No comments:
Post a Comment