Saturday, 25 August 2012

మృతమయం

నా తలను తెంచి నీ అరచేతుల పూలపాత్రలో ఆలంకరిస్తాను - ఒద్దికగా ఓపికగా ఇష్టంగా - రాత్రిపూట నీ గదిలో ఒక తెల్లని దీపమై వెలిగేందుకూ చీకట్లో మంచి నీళ్లకై నువ్వు తడబడితే ఓ నెత్తురు కూజానై నీకు అందేందుకూ- అందుకనే వెళ్ళిపోనీ నన్ను తాత్కాలికంగా. ఇపుడు కనుక నా అరచేతుల్లోకి నా ముఖాన్ని వొంచుకుని ఆ అద్దపు నీటిలో కొట్టుకులాడే రెక్కలు రాని పిచ్చుక పిల్లలని నేను అందుకోకపోతే, రేపటికి వెన్నెల కపోతాలని కన్నులపై రాసేన ఒక చీకటి మనిషి ఎలా చీకటై చిరుగులై తుంపి వేసిన నవ రేకుల పూవై నీ సన్నిధికి వచ్చి ఎలా ఈ మృత పదాలని చూసి రాస్తాడో యిక నువ్వే చూస్తావు- అనునయంగా ప్రేమగా!

No comments: