Saturday, 25 August 2012

పసి నిద్ర

ఈ రాత్రి దీపపు వెన్నెల కొమ్మ కింద నువ్వో పసి పసిడి సీతాకోకచిలుకవి- సబ్బునీళ్ళు చాలిక నీకు ఊదుతావు నీ పెదాలతో రంగురంగుల ఆకాశాల్ని దివంగత ప్రసంగాలుగా మారిన గృహ రణాల రుణాల మనుషుల ముందు- భగవంతుడా నాక్కొంచెం ఆ పసితనాన్ని తెచ్చివ్వు- నిదురపోతాను నీలా నిదురలో నవ్విన పసి పెదాలపై వీచిన నీ విశ్వ వేణుగానపు వెదురు వనాల్లా!

No comments: