Saturday, 25 August 2012

చావు నీ పల్చని పాదాలు రగిలి రగిలి ఎండకు నీ ముఖం పగిలి పగిలి నీ చల్లని చేతులు వొణికి వొణికి మధ్యాహ్నం మూడింటికి కుదేలవుతున్న ఆకలి కడుపుతో వడివడిగా ఇంటికి వచ్చి నిన్న రాత్రి దాచుకున్న ఆ అన్నం గిన్నెలోకి నీ ముఖాన్ని వొంచితే, జువెరియా తబుస్సుం దాచుకున్న అన్నం మెతుకులుకు నీళ్ళు పట్టి పాచి వాసన ఒక పామై నిన్ను నిలువునా నుదిటిన కాటు వేసిననాడు నీ కన్నీళ్లు ఏమైనాయి, ఆ సత్తు గిన్నెలో రాలిపడి ఏడ్చిన నా నీలి చావు ఏమైనాదీ?

No comments: