Friday, 3 August 2012

నన్ను

నన్ను ఆవహించి ఉండే ఆనందం, ఫోనులో ఆఖరి మాటతో ఆవిరైపోయింది అమ్మా మన అమ్మను కాపాడుతానని పోయావుగానీ ఈ అమ్మకు పుట్టెడు శోకం పంపిపోతావని అనుకోలేదు చితి మీద చిరునవ్వుతో నీవు వీరుడిలా పడుకుంటే నిన్ను ఆర్మీకి పంపిన నాటి నా దైర్యం కోసం వెతుకుతున్నా సేవజేయబోతే గొప్పొడివంకున్నా దేశం కోసం దేహం విడిచి అమ్మకే అందనంత గొప్పొడివయ్యావు నన్ను ఆవహించి ఉండే ఆనందం నీ ఆఖరి వీడ్కోలు దగ్గరే దహించుకుపోయింది దైర్యం నటించినా దైన్యం ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడ్డా నీకు జోహార్లు తెలుపుతూ

No comments: