Friday, 3 August 2012

అలల వాకిట

అలల వాకిట కలల వంతెన విధ్వంసంగా మారిన బతుకు మీద కత్తుల కవాతు ఆలోచనల రహదారులన్నీ అష్ట దిగ్బంధంలో చిక్కుకున్న చోట గుండె పచ్చి పుండుగా మారి గునపంగా గుచ్చుతున్న వేళ ఇప్పుడు ..మనసే కాదు ..హృదయం అగ్ని గుండమై మండుతోంది అప్పుడప్పుడు అనునయపు మాటలు తప్పా అనుకోనీ పలకరింపులు తప్పా చూపులు కరువైన చోట నెలవులు గతి తప్పిన చోట ఇక ..మాటలకు అందని భావాలే శరీరపు వాకిట సేద తీరాలని చూస్తాయి చీకటి వెలుగుల సమ్మేళనంలో గాలి దూరని కారడవిలో కాంతి రేఖలా నువ్వు కాల్పానిక జగత్తులో నేను ఇక మిగిలింది ఏమిటి ? గత కాలపు స్మృతులు తప్పా గతించిన కాలంలో నెమరు వేసుకున్న ఊసులు తప్పా .. సహచరి నువ్వు నిజం నీ తలపుల వర్షం వాస్తవం ..

No comments: