Friday, 3 August 2012

బాగుంది! భలేవుంది!

బాగుంది! భలేవుంది! ఎంత బాగుందో! చాలా హాయి నిస్తునట్టుంటుంది! మొదట మొదట్లో స్వర్గప్రాకారాల నీడలలో తారాడుతున్నట్టే! గొప్ప సంతొషాన్ని పంచి ఇచ్చే మహనేస్తం మనవెంట ఉన్నట్టే! కష్తమొచ్చినా, సుఖమొచ్చినా కావులించుకుని ఒదార్చే అత్మీయతలా, నిరంతరం వెన్నుతట్టి తోడుగా నడిచే శ్రెయొభిలాషిలా కనపడుతుంది! నిద్ర లేవగానే పలకరిస్తుంది, నిద్ర లేపి కూడా పరామర్శిస్తుంది! ఒక వ్యసనం మొదలయ్యేప్పుడు ఎప్పుడూ ఇలాగే అనిపిస్తుంది! ఆ కబంధ హస్తాల దృతరాష్ట కౌగిలి జీవితాన్ని కబళించే వరకూ, రుచిమరిగిన వారు, పోతారు, పోతారు, పోతూనేవుంటారు సర్వనాశనం వైపు! ప్రారంభంలో సరదాగా మొదలై, క్రమక్రమంగా అలవాటుగా మారి, పిమ్మట వదలలేని బలహీనత గా తిష్ఠవేసుక్కుర్చునే మత్తు మహమ్మరిని, మనిషి గమనించకపోతే బ్రతుకు బండలై పోవడం ముమ్మటికీ ఖాయం! ఓ.యు. క్యాంపస్ లో డ్రగ్స్ రాకెట్ గురించి చానల్స్ చెప్తుంటే భయం, ఆందోళన! చిన్నారులకు స్కూల్స్ లో పంపకాలు! యువతకు కాలేజ్ లో విక్రయాలు! కొందరి వ్యాపారం ఎందరి బ్రతుకులకు నిప్పుపెడుతోందో..తెలియని అంధకారం. రేపటి సమాజంలో అడుగుపెట్టవలసిన తప్పటడుగులన్నీ తప్పుటడుగులే ఐతే, ఎదగవలసిన దశలో వ్యక్తిత్వాలు కోల్పోయి వెన్నెముక లేని వ్యక్తులుగా మిగుల్తూ, నైరాశ్యపు చింతలలో నలిగే భావితరాలకు భద్రత ఎక్కడుంది నేస్తం!?

No comments: