Friday, 3 August 2012

ఆది అంతం మధ్య

ఆది అంతం మధ్య ఊగిసలాట నా హృదయ విలాసం... అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ ఓ వీలునామా నా కవిత్వం... ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా కాగితంపై ఒలికిపోతూ... పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా లేలేత సూర్య కిరణంలా ఓ గాలి తిమ్మెరలా కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా సహజంగా సహానుభూతిగా ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా హృదయాన్ని తాకాలన్నదే నా కల..

No comments: