Friday, 3 August 2012

మౌన గానం

మౌన గానం కళ్ళ బాసని తర్జుమా చేయడంలో ఓ ఆనందం ఉంది.. ధ్వని చూపులకు స్పందించడం లో ఓ సంభ్రమం ఉంది.. స్పర్శల భాషకి లిపి కనుక్కోవడం లో ఓ ఆశ్చర్యం ఉంది.. పెదాల మాటలకు స్వరాలను అల్లడం లో ఓ విస్మయం ఉంది.. మనసు పరిమలాలకు దేహ శిల్పాన్నివ్వడంలో ఓ అద్భుతం ఉంది.. నీకూ నాకూ మధ్య ఉన్న నిశ్శబ్దం లో నా గుండె సవ్వడిని నువ్వు అనువాదం చేయడంలో ఓ విచిత్రం ఉంది.. ప్రియా, నీ మౌనాన్ని సైతం అర్ధం చేసుకోవడం లో నా ప్రేమ ఉంది..

No comments: