Friday, 3 August 2012

అడుగులు

మనిషిని మనసును మరచి కదిలే అడుగులకు ఆత్మీయతలు ఏం తెలుసు ఈ అడుగులు ఒకప్పుడు మండుటెండలో రగిలే ఇసుకను చెమటతో చల్లర్చాయి భాషల ఊసులు తెలియనప్పుడే భావాలను పూయించాయి ప్రేమను పండించాయి కదిలే అడుగులకు కడకు రాళ్లు కూడా నునుపెక్కాయి కొండలను కోసుకుంటూ వెళ్ళిన గాలిని బండలను కరిగించిన ఎండల వేడిని జారుతూ పారుతూ జలం వెదజల్లిన జీవాన్ని కాలి అడుగుల కళ్ళు ఎప్పుడో చూశాయి కాంక్షలను కిరీటాలను వదిలి ప్రేమను పంచుకుంటూ ,పెంచుకుంటూ కదిలిన అడుగుల గురుతులు ఏ కన్నులకు కనిపించవెందుకో కుత్తుకలని కోసి కత్తులు పారించిన కరకు మరకలు అంటుకున్నపుడు సైతం, ఆ అడుగులు ఇప్పటిలా లేవు ఎన్నో చేసిన ఎన్నో చూసిన ఎన్నో చూపించిన ఆ అడుగుల గురుతుల్లో ఈ అడుగులు వెతుకుతున్నవి మలినాలేనా ?

No comments: