Friday, 3 August 2012

ఒత్తిడి

దించిన తల ఎత్తలేనంత బాధ్యత మీద ఉన్నా తలపులో కూడా ఊహించని బరువును మోస్తున్నా అంతమొందించవసిందేనని తెలిసినా నా మనసు నుంచి వేరు చేయలేకున్న ఇంత ఒత్తిడిని భరించేది నేనేనా గమ్యం చేరాలి మజిలీలు ఎన్నైనా సాగిపోవాలి సన్నిహితులు దూరమైనా తట్టుకోవాలి అనుబంధాలు అలిగివెల్లినా శిలగా మారాలి చిలిపి నవ్వుకు అదిరిపడ్డ యవ్వనమైనా శిథిలమైపోవాలి మధురోహన పరిమళాలు మదిని అల్లుకున్నా జీవనవాహినిగా ప్రవహించేదే జీవితం సహకరించి వహించాలి సారధ్యం ఆగిపోతే అదే వినాశనం

No comments: