1.బద్ధకం కనపడని శత్రువు – వివేకం విడిపోని మిత్రుడు !!
2.అందకుంటే అది అందం – అందుకుంటే అది బంధం

3.ధర్మానికి నీతికి కొలతలు లేవు – అనురాగానికి ఆప్యాయతకు హద్దులు లేవు !
4.సమర్ధుడికి ఎదురు లేదు – అసమర్ధుడికి ఎదుగు లేదు !

5.ప్రతి జంతువుకు తన జాతి లక్షనాలు ఉంటాయి – మనిషిలో మాత్రం సర్వ జంతు లక్షనాలు ఉంటాయి !
6.వద్దంటే ఇస్తామంటారు – ఇవ్వమంటే లేదు పొమ్మంటారు

7.కష్టాలలో దేవుడు కనపడతాడో లేడో – సుఖాలలో మాత్రం జీవుడే కనపడతాడు.
8.చెప్పినపుడు చేయాలనే ఉంటుంది – చేసెటప్పుడు తెలుస్తుంది కష్టం-సుఖం

9.ఏం కావాలో తెలిస్తే – ఎంచేయాలో తెలుస్తుంది – ఎక్కడికెళ్ళలో తెలిస్తే ఎలా వెళ్ళాలో తెలుస్తుంది
10.ఇచ్చే టపుడు అందరూ నీవాళ్ళే – అడిగావంటే ఎవరికి ఎవరో

11.ఓ మనిషి దుర్వినియోగమే నీ నైజం – దురహంకారమే నీ కాష్టం
12.శుబ్రంగ ఉండి చూస్తూ ఉండేవాడికన్న – అపరిశుబ్రంగా ఉన్న ఆదుకునే వాడే మిన్న

13.పనిచేస్తూ మాట్లాడితే పట్టుదొరకదు – మాటలనే పట్టుకుంటే గట్టు దొరకదు
14.కష్టాలను సుఖాలుగా మార్చేది అశావాదం – సుఖాలలోనూ కష్టాలను వెతికేది నిరాశావాదం

15.మాటే ఒక మంత్రం – మౌనం ఒక మహామంత్రం
16.అందరినీ నమ్మేవాడు అమాయకుడు – ఎవరినీ నమ్మనివాడు యెర్రివాడు

17.వాగుతుండేవాడు ఓటికుండ – నిమ్మకుండే వాడు నిండు కుండ
18.ఎందరో అజ్ఞానుల పొగడ్త కన్న – ఒక్క జ్ఞాని మెప్పు మిన్న

19.వెలుగుకోసం ఎదురుచూడటం కంటే – వెలుగున్న చోటుకి వెళ్ళడం మేలు
20.ఆరంభించాక అపాలనుకోకు – అల్పుల మాటలు అడ్డంకులనుకోకు

21.ఏ కాంతా దొరకనివానికి ఎకాంతం దొరికినట్లే – ఓ కాంత దొరికిందంటే ఒకింత దొరికినట్లే !
22.చెడు సంపాదన తీరని రోగం – మంచి మాటలే మనసుకు మోదం

23.అభినందన అహ్లాదాన్నిస్తుంది – అవమానం అవేషానిస్తుంది
24.దేహముంటే సందేహముంటుంది – మోహముంటే వ్యామోహముంటుంది

25.పరిస్థితులు ఎవరినయిన పక్కదారి పట్టిస్తాయ్ – కష్టాలు ఎవరికయిన కన్నీళ్ళు రప్పిస్తాయి.
26.మూర్ఖుడు కొంతనేర్చినా ఎంతో నేర్చినట్లు – జ్ఞాని ఎంతోనేర్చిన కొంతే నేర్చినట్లు

27.ఒకరు బాగుపడితే చూడలేని వారు – తాము బాగుపడ్డా సుఖపడలేరు!
28.ఎల్లప్పుడు సుఖం ఎవరికీ రాదు – అప్పుడప్పుడూ కష్టం అందరికీ వస్తుంది!

29.నిందలు మోపేవాడు నీచుడు – అబద్దాలు చెప్పేవాడు అల్పుడు.
30.అనుకున్నది దొరికితే ఆనందం – అనుకోనిది దొరికితే అద్భుతం.

31.ఆస్వాదించడం అందరికీ తెలుసు – అనుభవించడం కొందరికే తెలుసు !
32.ఆఖరుదాకా అడుగేయ్యకుంటే –అంటుకున్నాక పరుగేయ్యలేవు !!

33. మాటలు మల్లెపూలు – పాటలు వాటి పరిమళాలు !
34.మంచి మాటలే మనసుకు నచ్చు – చెడ్డమాటలే చెవిలో చిచ్చు!!

35.ఇంటిగుట్టు ఇల్లాలికెరుక – వొంటిగుట్టు వైద్యునికెరుక !
36.ప్రేమకు అంతం పెళ్ళి – జననానికి అంతం మరణం!!

37.కళ కలకాలం ఉంటుంది – కల కళ్ళు తెరిస్తే పోతుంది.
38.సోమరిపోతుకు చిక్కదు విజయం – కష్ట జీవికి కలుగదు దుఖం!

39.కోపాన్ని జయిస్తే లోకాన్ని జయించినట్లే – అవేశాన్ని జయిస్తే అందరినీ జయించినట్లే
40.వెళితేనే తెలిసేది దారి – దిగితేనే తెలిసేది లోతు!!

41.ఇంట్లో సమస్యలు ఇరుకున పెడతాయి – బైటి సమస్యలు బజారున పెడతాయి
42.మాట విరుపు చేటు తెచ్చు – మతిమరుపు కొంప ముంచు!

43.కవులు ప్రకృతిని చూసి పరవశిస్తారు – మహాకవులు పరమాత్మ కోసం పరితపిస్తారు
44.సక్రమ సంపాదన సౌభాగ్యమిస్తుంది – అక్రమ సంపాదన ఆపదను తెస్తుంది !

45.ఇష్టమైన వారు కష్టపెట్టినా సుఖమే – ఇష్టంలేనివారు సుఖపెట్టినా కష్టమే
46.అడగని సలహాలు వ్యర్ధం – అతులేని ఆశ అనర్థం!

47.సంసారం ఒక చక్కని సంగీతం – విడాకులు ఓ విషాద గీతం
48.నిజం నిప్పులాంటింది – అబద్దం అప్పులాంటిది !

49.అడిగినవారికి అన్నం పెట్టు – అడక్కముందే సాయంపట్టు !
50.అదృష్టాన్ని అడ్డగించలేము – దురదృష్టాన్ని దూరం చేయలేం !!

51.అరిచినంతమాత్రానా ఆలకించరు – అడిగినంతమాత్రానా అప్పగించరు
52.చెడుతలంపు ఒక తలవంపు – మంచి తలంపే మరో మలుపు!

53. అర్హత ఉన్న వారినే ప్రేమించాలి – అదికారమున్న వారినే ఆశ్రయించాలి !
54.ఎదురు దెబ్బలే మేలుకొలుపులు – ఎదుగుదలకి రాచబాటలు !!

55.ఏకాగ్రత ఏదైనా సాదిస్తుంది – నిరాశ నిలువునా ముంచుతుంది !
56.మనసే మనిషికి ఆయుధం – చెడుతో చేయాలి యుద్ధం !!

57.శారీకానందం చిరు ఆనందం – మానసికానందం మహదానందం !
58.నీ రాత నీవే రాసుకోగలవు – నీ బాట నీవే వేసుకోగలవు !!

59.ఈర్షా ద్వేషాలు – ఈగలు దోమలు !
60.కక్షలు కార్పణ్యాలు – కుక్కలు నక్కలు !!

61.ప్రశ్నలు లేనిది ప్రేమ – సమాధానాలు లేనిది ద్వేషం !
62.కోరూతూ ఉంటే కోరికలు పుట్టు – సంతృప్తి పడితేనే సుఖశాంతులొచ్చు!

63. మాట కలిపితే స్నేహం – మాట తప్పితే మోసం !
64. రక్తికి అంతం విరక్తి – భక్తికి అంతం ముక్తి !

65.చీడ పడితే చెట్టు కూలుతుంది – చెడు మాటలు వింటే కాపురం కూలుతుంది !
66.అందరు చెప్పింది ఆలకించు – ఎవరికీ చెప్పకుండా ఆచరించు !!

67.కష్టాలు ఏడ్చినా పోవు – సుఖాలు నవ్వినా రావు!
68.అర్హత ఉంటేనే అందుకుంటావు – అదృష్టం ఉంటేనే అనుభవిస్తావ్!!

69.నీ ఉప్పు తిన్నాడని బాధపడకు – పప్పుతిననందుకు సంతోషించు !
70.వచ్చిన అవకాశం వదులుకోకు – పొయినదాని కోసం ఏడవకు !!

71.కర్మఫలమే కాపురం – జన్మఫలమే జాతకం !
72.గొప్పలు చెప్పకు – తప్పులు వెదకకు !!
72.గొప్పలు చెప్పకు – తప్పులు వెదకకు !!
73.పారే నీటికి వాగే నోటికి అడ్డుకట్ట వేయడం అంత సులభం కాదు!
74.పిరికితం గుండె జబ్బు లాంటిది – పిసినారితనం అంటురోగం లాంటిది !!

75.తినికూచంటే తిప్పలే – పని చేయకుంటే పస్తులే !
76.ఇచ్చేవాళ్ళనే దోస్తారు – దోచేవాళ్ళకే ఇస్తారు!

77.మనసు బలహీనమయితే శరీరం సహకరించదు – మనిషి బలహీనుడవుతే సమాజం సహకరించదు !
78.ఓర్పు ఒడ్డుకు చేరుస్తుంది – నేర్పు విజయాన్ని చేకూరుస్తుంది !!

79.మనసు మలినమైతే – శరీరం శిథిలమౌతుంది!
80.భూమిని నమ్మితే భుక్తి దొరుకుతుంది – అమ్మను నమ్మితే అన్నం దొరుకుతుంది!!

81.వీలు లేనప్పుడే వీలునామా – ఆనవాలు లేనప్పుడే పంచనామా !
82.తగాదా తలనొప్పిని తెస్తుంది – తమాషా ఆనందం ఇస్తుంది !!

83. అలవాటైతే కష్టాలే సుఖాలౌతాయి – అధికమైతే సుఖాలే కష్టాల్లాఉంటాయి !!
84.చెప్పడం ఆపు, చెయ్యడం మొదలెట్టు – నిర్ణయం నిలకడక చేయాలి అలోచన ఆత్రుతగా రావాలి !?

85.తిరిగి చూస్తే గతం – ఎదురు చూస్తే భవితం
86.అనుమానం ఓ అడ్డుగోడ – అహంకారం ఓ అంధకారం !!

87.అలుపెరుగదు వలపు – వలపెరుగదు వగపు
88.ఇప్పుడే చెయ్యండి స్నేహం – ఎప్పుడూ చెయ్యద్దు ద్రోహం !!

89.అదుపు లేక పొదుపు లేదు – అలుపు లేక మలుపు లేదు
90.ఎవరూ చూడలేదని తప్పు చేయకు – అందరూ చేస్తారని అప్పు చేయకు!!

91.పొరుగూరు వారంత పగవారు కాదు – మన వూరి వారంతా మంచోళ్ళు కాదు!
92.ఆహారం అధికమయితే అజీర్ణం – విహారం అధికమైతే వైరాగ్యం!!

93.ఇచ్చినపుడే పుచ్చుకోవాలి – నచ్చినపుడే మెచ్చుకోవాలి !
94.అతి బాషణం మతి హాని – మిత బాషణం ఒక బూషణం!!

95.అలక తీరితే కులుకు – వరస మారితే వణుకు !
96.తిండిలో ముందుండాలి – తగాదాల్లో వెనకుండాలి !!

97.ఎదురుతిరిగితే ఎదగలేవు – భయపడుతుంటే బ్రతకలేవు!
98.పనిచేస్తే పస్తులుండవు – పవళిస్తే ఆస్తులుండవు!!

99.నవ్వులెక్కువైతే నవ్వులపాలు – ఏడుపెక్కువైతే ఎక్కిళ్ళపాలు!
100.అలరింపజేసేది అందం – పులకింపజేసేది బంధం!!

101.తలుపులు మూస్తే తమస్సు – తలపులు మూస్తే తపస్సు!
102.సాహిత్యంలోని సౌందర్యం,విరిసిన మల్లెల సుగంధం – సాన్నిహిత్యంలోని సౌగంధం చల్లని చూపుల్లోని మకరందం !!

103.రత్నాలు కావాలంటే రాళ్ళలో వెదకాలి – పనులు సాధించాలంటే పరిశ్రమించాలి!
104.నేర్పున్నవాడే మార్పు తేగలడు – ఓర్పున్నవాడే తీర్పు చెప్పగలడు !!

105.నడిచేవారికి అలుపు రాదు – పరిగెత్తేవారికి పలుకు రాదు !
106.నీవు పుట్టినచోటే పుణ్యభూమి – నీవు గిట్టినచోటే ఖర్మభూమి !!

107.ప్రతిభ ఉంటేనే ప్రగతి – వినయం ఉంటేనే విలువ !
108.అసూయను వదిలితే అనసూయ – అహంకారం వదిలితే మమకారం !!

109.మాటలే పాటలవుతాయి మనసు బాగుంటే – మాటలే ఈటెలవుతాయి కటువుగా ఉంటే !
110.అడిగింది ఇస్తే ఆనందం – అడగంది ఇస్తే ఆహ్లాదం !!

111. చిరునవ్వులే చినుకులు – వాలు చూపులే వలపులు !
112. పలుకులే ములుకులైతే బంధాలే బండలౌతాయ్ !!

113. తెలివి మీరాకే భోగాలు-వయసు మీరాకే రోగాలు !
114. లోపాలుంటేనే కోపాలోస్తాయ్-పాపాలుంటేనే శాపాలోస్తాయ్ !!

115. చెప్పందే ఏదీ తెలియదు – చెయ్యందే ఏదీ జరుగదు !
116. మనసు ఒక హద్దులేని గుర్రం – బుద్దే దానిని అదుపు చేయు కళ్ళెం !!

117.దగ్గరైతేనే మనసు కలిసేది – దూరమైతేనే విలువ తెలిసేది !
118.కలగలుపు వలపు నింపు – ఎడబాటు ఏడిపించు !!

119.ధనముంటే గర్వం హెచ్చు – దానమిస్తే గౌరవం వచ్చు !
120. నీవు తింటే శారీరకానందం – ఒకరికి పెడితే ఆత్మానందం !!

121. అవివేకం అంతరిస్తే – వివేకం అంకురిస్తుంది!
122. ఆవేశం అంతరిస్తే – ఆలోచన అంకురిస్తుంది !!

123. అహంకారం అంతం చేస్తుంది – మమకారం మంచిని చేస్తుంది!
124. తొందరపడితే గందరగోళం – నెమ్మదిగుంటే కలుగును యోగం!!

125.ఎక్కువ తింటే ఒంటికి కష్టం – ఎక్కువ వాగితే పనికి నష్టం!
126.ఉన్నది చెప్పేవాడు ఉత్తముడు – లేనిది చెప్పేవాడు లేకివాడు!!

127.తెలియంది తెలుసుకుంటే జ్ఞానం – తెలిసింది దాచుకుంటే అజ్ఞానం!
128.చింత తీరితే వింత – చెంత చేరితే సొంత!!

129.అబద్ధాలు చెప్పేవాడు అల్పుడు – నిజాన్ని దాచేవాడు నీచుడు
130.ఏ జన్మ పాపమో ఈ జన్మ ఫలం – ఈ జన్మ పుణ్యమే మరుజన్మ ఫలం!!

131.అనుభవం అక్కరకొస్తుంది – అభిమానం ఆదుకుంటుంది!
132.కలలు కంటే కష్టాలు తీరవు – కష్టపడితే నష్టాలు ఉండవు!!

133.కాలం కలిసొస్తే కలిమి-కలకాలం కలిసుంటే చెలిమి !
134.అవసరానికి ఆడుకుంటే ఆప్తుడు – అడగకుండా తీసుకుంటే అల్పుడు !!

135.తెలివైనవాడిని తీర్చిదిద్దడం కన్నా- అమాయకుడిని ఆదరించడం మిన్న!
136.అలవాట్లు మార్చుకోవడం అతికష్టం – పొరపాటు దిద్దుకోవడం మహా కష్టం!!

137.ఆలోచించక ఒప్పుకోవద్దు – ఒప్పుకున్నాక తప్పుకోవద్దు !
138.సమస్యలేని మనిషి లేడు – చావులేని జీవి లేదు !!

139.గౌరవం రమ్మంటే రాదు – అపకీర్తి పొమ్మన్నా పోదు !
140.తగాదాలతో తంటాలే – సర్డుకుపోతే సరదాలే !!

141.కష్టాలు వస్తేనే దేవుడిని తలుస్తాం – రోగాలు వస్తేనే వైద్యుడిని కలుస్తాం !
142.కుమ్ములాటకే కులాలు – మంటబెట్టేవే మతకలహాలు !!

143. వివరించలేనిది విరహం – నిలువరించలేనిది ప్రవాహం !
144. పెళ్ళే వయసుకు కళ్ళెం – కళ్ళే మనసుకు గొళ్ళెం !!

145. యవ్వనం ఎదిరిస్తుంది – వృద్ధాప్యం ఉడికిస్తుంది !
146. మిథునం మధురం – నిధనం అధమం !!
146. మిథునం మధురం – నిధనం అధమం !!
No comments:
Post a Comment