ఎవరినైనా ప్రేమించావ...?
ఎవరినైనా ప్రేమించావ...?
అని అడిగినప్పుడు ఏం చెప్పను. అవును
ప్రేమించ చాలామందిని
ప్రేమిస్తున్న కొంతమందిని
కానీ, నే కోరుకొనే శాశ్వత ప్రేమ
నాదైన....ప్రేమ
ఎక్కడ లభించడం లేదు.
కొన్ని యుగాలుగా ఫలించని ప్రేమ
ఈ జన్మలోనైన వరిస్తుందనే ఆశతో...
లిఖిస్తున్న నా ఆరాధనను ఈ అక్షరాలలో అంతే...
No comments:
Post a Comment