అభౌతిక అంశాలకేపుడు
భౌతికమైన వాటితోనే పని ఉంటుంది
ఇలా ఎందుకో నాకస్సలు అర్థం కాదు
ఉదా: ప్రేమనే తీసుకుంటే...
ఒకరిని ప్రేమించినపుడు తిరిగి వారి ప్రేమను పొందడంతో అభౌతిక వాంఛ ముగిసిపోతుంది కదా...
కానీ,ప్రేమించాలి అనుకున్నప్పటి నుంచే అతనేంటి ? ఉద్యోగం ఉందా? సంపాదన ఎంత ?.....
ఏంటి ఇవన్ని?
ఒక్క ప్రేమ విషయంలోనే కాదు ఏ రిలేషన్ అయినా ఇంతే...
మనసుకన్నా... మమతకన్నా.... మనకన్నా మిన్నగా...
డబ్బు ,పేరు-ప్రతిష్టలు ,హోదాలు చెలామణి అవుతుంటే...
ఇవి లేకుండా నేనంటూ లేనంటే...
నా ఉనికే ప్రశ్నార్థకం అవుతుంటే....
వీటి కోసమేనా.... ఈ నా జన్మ అని
మూగగా రోదిస్తున్నాను...
కానీ ,భౌతికమైన ఈ పునాదులపై
అభౌతికమైన నా భావాల కట్టడాలను నేను నిర్మించలేను.
బంధాల కోసమో ,భాద్యతల కోసమో రాజీపడాల్సి వస్తున్నపుడు...
నలుగురితో పాటు నారాయణ అంటూ... జీవిస్తూ ఉన్నపుడు..
మరణమే ఇంతకన్నా సుఖమేమో అనిపిస్తుంది.
No comments:
Post a Comment