Monday, 16 April 2012

కలల అక్షరాలు - కాగితపు పడవలు





నాడు...
నా కలలన్ని అక్షరాలుగా రాసా ఈ  కాగితాలపై
నేడు
వాటిని కాగితపు పడవలుగా మార్చి
కన్నీటి కొలనులో వదిలేస్తున్నా...
అనాధలను చేసి....
ఆ కలలన్నీ కావ్యాలవుతయనే ఎదురు చూపులు ఫలించకుండానే
భారమైన  మనసుతో నీకు దగ్గరయ్యాను.
నన్ను సేద తీర్చగలవు
కాసింత ప్రేమ పంచగలవు
కానీ, నా కలలను లిఖించ లేవుగా
అందుకే....పోనీ,
నా కలలన్నీ అనాధలై పోనీ
ఏ తీరమైన చేరుకోని ,
నాకు అనవసరం.
నీ ఎద గూటిలో సేద తీరే,
ఈ క్షణం శాశ్వతమైతే చాలు.....!!


No comments: