నీవు జీవం
లేని నేను జీవచ్చవం !
ఎడబాటు మృత్యు ఒడి
ఎన్నిసార్లు చేరానో జారిపడి!!
కాలం కర్కశ రూపిణి
చేస్తోంది అనుబంధాలతో గారడి
ఎదచేర్చి....సేద తీర్చి...
శాశ్వతం అనుకోనేలోపే విడదీసి
అంతా... మిథ్యా అనేస్తుంది.
మరి,
దాని గారడిలో ఉన్న మనసు ?
మనిషి ఏం కావాలి ??
వీలైతే మరణం
లేదా మరణిస్తూ....జీవనం
ఇదేనా...జీవిత సారం ?!!
No comments:
Post a Comment