Monday, 16 April 2012

మగువా....ఓ...మగువా...!!




ఓ...మగువా....!
వర్ణనకు ఆధారమైన నిన్ను వర్ణించడం తగునా...!!
ఏ సొగసు చూసి మనసు చంచలమగునో....
ఏ ప్రేమ అందరిని కట్టివేయునో...
ఏ ఓర్పుకు శిరస్సు వంగి పాదాభివందనం చేయునో...
అలాంటి నిన్ను వర్ణించడమా ...!!
స్ప్రష్టికి  ప్రతిస్పృష్టి చేసి
అవని అణువణువునా... దాగిన అందం నీవు.
ప్రతి జన్మకు వారధిలా....
మా వెన్నంటి ఉండే నీడవు నీవు.
పువ్వును నలిపినట్టు నలిపినా....
చేతులకు అంటే సుగంధం...నీవు
నీ వీరత్వంతో రాజ్యాన్ని ఏలినా....
కోపాగ్నితో భస్మం చేసిన...
నీవే కదా...అవనికి ఆధారం.
      అనాదిగా నీ అస్తిత్వాన్ని రక్షించుకుంటూ....
      నింగిని నేలను ఏల గలిగిన అపూర్వ....శక్తివి నీవు
ఒడి తానై మలచినా....
ఎదపై  లాలించినా...
బడి తానై భోధించినా...
బంధమై అల్లుకొని భరించినా...
కోపమైనా - స్నేహమైనా
ప్రేమైనా - వంచానైనా
ఏదైనా.....నీవు  లేని నాడు మేము...
అసలు మేమంటూ...ఉంటామా...?!
అందుకే తనని గౌరవిద్దాం...
ప్రేమిద్దాం - మన్నిద్దాం...
అంతే కానీ...,
తన అందానికి యాసిడ్ మరకలు అంటించవద్దు.

No comments: