Monday, 16 April 2012

పరాన్న జీవి



కాలంతో పరిగేత్తలనుకుంటా
కాళ్ళు  లేవు
అందుకే మనసుని పరిగెత్తిస్తుంట అనుక్షణం
కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా..అని
సర్దుకుపోతుంటా..
కష్టాలే తప్ప ఇంకేం లేవు
అందుకే కన్నీళ్ళు కారుస్తా...
ఇంకేం చేయగలను నేను
అశక్తురాలిని
ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి బ్రతికే పరాన్న జీవిని..!!
ఎంత ధైర్యాన్ని కుడకట్టుకున్నా..
పరిస్థితులతో ప్రతిరోజు ప్రచ్చన్న యుద్ధమే అయితే..
ఎక్కడి నుండి తెచ్చుకోను మొండి ధైర్యాన్ని?
100 * 365 రోజుల జీవితం
ఎన్నో ఆశలు, ఆశయాలు
మరెన్నో అవకాశాలు
ఒకరికి నుండి స్పూర్తి పొందుతూ
మరొకరికి స్పూర్తినిస్తూ...
ప్రతిరోజు కొత్తగా జన్మిస్తూ..బ్రతకాలనుంది.
అడుగు వేయాలంటే అడ్డంకులే అయితే
ఎలా నేను బ్రతికేది ??
సగం జీవితాన్ని కబళించిన
ఇంకా నీ దాహం తిరలేదా  దైవమా ???

No comments: