Monday, 16 April 2012

పదాల...ప్రయోగం.

ఆకాశం,భూమి ఎప్పటికి కలవవు అని తెలుసు...
నీ జీవిత పయనంలో
 నా గురించి ఆలోచించే తీరిక నీకు లేదు అసలు ఆ ఆలోచనే లేదు
శిల లాంటి నా బ్రతుకు లో ప్రతి వసంతానికి చిగురించే ఆశవు నీవు
 కరిగి పోయే కలను అయినా..ఇంకా..జీవిస్తూనే ఉన్న
గాలికి ఆరే దీపాన్ని అయినా ఇంక..వెలుగుతూనే ఉన్న నీ ప్రేమకై
ఎన్ని మేఘ సందేశాలను పంపాను నా కళ్ళతో
 అవి నిన్ను చూడగానే కరిగిపోయాయి.
కరిగిపోయి అక్కడే వర్షించ వచ్చుగా నా కన్నీరై
కానీ, నీ ఇసడింపుని  నన్ను గమనించని నీ చూపులని మొసుకుని వచ్చి
నా కళ్ళల్లో కడలిని నింపాయ్..
ఏమని వర్ణించను నా బాధను
 ఎన్ని వేల పదాలను వెతుక్కోను...
ఆ పదాలే విసుక్కుంటున్నై
 పదే పదే వాటితో ప్రయోగాలు చేస్తున్నానని...

No comments: