రాత్రి...! నీ వగలు చాలించి
పగటికి దారి చూపించవే
రాత్రి...!!
నీ కొప్పున ధరించిన చంద్రుని దాచి
ముతైదువు నుదిటి సింధూరంలా మెరిసే
సూర్యభగవానుని రథచక్రాలను కదలనీయవె
రాత్రి...!!!
నీ ఒడిలో ఆదమరచి నిదరోతున్న లోకాన్ని
చైతన్య పరిచే పగటికి తెరతీయవే
రాత్రి...!!!!
నీ మల్లెల వాసనలు ,
వెన్నెల వెలుతురులు
ఆకాశాన్ని తాకే భవంతులలో సేదతీరుతున్న ఆ ధనవంతులకే కానీ,
ఆకలితో నకనకలాడుతూ
తన బక్క చిక్కిన కడుపు చూసుకుంటూ...
నిదుర రాక ,వేకువకై ఎదురు చూసే ఆ పసివాడికి కాదు.
రాత్రి...!!!!!
ఏడుజాముల వేళైన ఏడుకొండలవాడు నిదురలేవకపోతే ,
ఆ ఆకలి జీవుల ఆర్తనాదాలు ఎవరు వినిపించుకోరే.
No comments:
Post a Comment