Monday, 16 April 2012

ఆడ - మగ




ఏనాడు నా ఉనికిని క్షణమైనా గమనించని ఈ లోకం
నేడు నేను నీ జత చేరగానే
క్షణమైనా వదలక నన్నే చూస్తోంది...
మాట వరుసకైనా...నన్ను పలుకరించని ఈ లోకం
నేడు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది....
కారణం...??
మన ఇద్దరి మధ్య ఏముందనే ఈ లోకం యొక్క కుతూహలం
స్నేహం,ప్రేమ,రక్త సంబంధం ,
వీటన్నింటిని మించిన అనుబందం ఒకటి ఉంటుందని
దానికి పేరే....లేదని ఈ లోకానికి ఎలా చెప్పను.
చెప్పినా హర్షిస్తుందా... ఈ లోకం
ఎందుకంటే.....??
నువ్వు ఆడ
నేను మగ కదా...!!!

No comments: