ప్రేమను తెలపడానికి మూడే పదాలు ఉంటె
మరి ఆరాధనను తెలపడానికి ఉన్న ఏకైక పదం "నేను"
అవును నేను మాత్రమే నా ఆరాధనను తెలుపగలను...
పదాలకు అందని
భావాలకు చిక్కని నేను
యతులు , ప్రాసలు లేని వివస్త్రనై
నన్ను నేను నీ ముందు ఆవిష్కరించుకొని
ఓ... నగ్న సత్యానై నిలుస్తాను.
ఇష్టంతోనో.... మొహంతోనో....
విరహ వేదనతోనో......తరగని వాంఛతోనో....
పట్టి పట్టి ప్రతి అక్షరాన్ని చదువుతూ... వెళ్తావు.
లోతులు కొలుస్తూ...ఉంటావు.
ఆ కొలమానంలో ఏ మధుర భావన్నో పొందాలని
నే ఆర్రులు చాచి ఉంటె ఆ పనిని మధ్యలో వదిలేసి
మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతావు...
ఇదో సర(స)దా ఆట నీకు...
నేను పూర్తిగా... అర్థమైయ్యే వరకు
పెదవుల కింద నలిపి నలిపి
పంటిగాటు పెట్టిగాని వదలవు.
పోనీ అపుడైన అర్థమయ్యనా... అంటే..?
నిన్ను ఇంకా... (పరి)శోధించాలి అంటావు.
నీ శోధన
నా ఆరాధనా
సృష్టి ఉన్నంతవరకు ఆగదేమో....!!
No comments:
Post a Comment