Monday, 16 April 2012

అదేంటో...

అదేంటో...
నాభి నుండి ఎద దాకా...
సర్రున ఎగబాకుతుంది.
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా..
చేతికి చిక్కదు
పట్టు వదలదు
ఎటు నుంచి ఎటు పాకుతుందో
మెలిపెడుతుంది దేహాన్ని..
అదేంటో....
ఎంత తడిపిన తడవని పెదాలు..
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...
అదేంటో...
ఏదో భారాన్ని మోస్తున్నట్టు
ఎపుడు వాలిపోదామా అనుకునే కళ్ళు
మూతలు పడితే చాలు
తెరవాలనే ఆశే లేకుండా...
నిదురించాలని అనుకుంటాయి.
ఏంటి ఇదంతా...అంటే
కారణం ఒకటే...
"నువ్వు".

No comments: