పిల్లలే ప్రాణంగా, ఊపిరిగా
పిల్లలే ధ్యేంగా, ధ్యానంగా
వాల్ల ఆనందం...
తన ఉత్సాహానికి మూలంగా
వాల్ల దరహాసాల్లే...
తన జీవిత లక్ష్యంగా
వారి ఉన్నతికి ప్రేమ శిఖరాలు నిర్మించే
వారి విజయాలకు జయభేరిలు మ్రోగించే
వారి ప్రగతిని అనుక్షనం కాంక్షించే
వారికోసమే తపిస్తూ జీవించే
తల్లి కన్న ప్రేమకు
తల్లి కున్న ప్రేమకు
తల్లి అన్న మాటకు
విలువెంతని ప్రశ్నిస్తే?
పాలలోని తెల్లదనం ఎంతట
విరిసేపూల అందం ఎంతట
పొంగిపొరలే అలల చప్పుడెంతట
వీచేగాలి స్వేచ్చదనం ఎంతట
సూర్యుడి వెలుగుల కాంతి ఎంతట
రంగుల రంగుల ప్రకృతి సోయగము ఎంతట
పసిపాపల కేరింతల ఉబలాటం ఎంతట
కొలవలేనిది వెలకట్టలేనిది అమ్మప్రేమంతంట
No comments:
Post a Comment