ఇరు హృదయాలు కలిస్తే అది ప్రేమ
అదే ఒక హృదయంలో నాలుగు హృదయాలు కలసి ఉంటె..?
అదే స్నేహం !!
ఆక్సిజన్ లేకుండా బ్రతకలేము అంటారు కానీ ,
నేను మాత్రం
స్నేహం లేకున్నా... బ్రతకలేం అంటాను !!!
ఐశ్వర్యంలో మునిగితేలుతున్నా
కనిపించని ఆనందం
అనుకోని దారిలో నిన్ను చూసినపుడు
వేయి ఓల్టుల బల్బులా నా కళ్ళల్లో వెలుగుతుంది.
నీ సహచర్యం ఉంటె..
'బాధ' నా నుండి దూరంగా... పారిపోతుంది.
ఏనాడో మనం కలబోసుకున్న ఊసులు
నేను ఒంటరినైనప్పుడు
నా దరి చేరి నన్ను లాలిస్తాయి.
నా బాల్యపు జ్ఞాపకాలలో...
ఎవరున్నా... లేకున్నా... నువ్వు ఉన్నావు
అప్పటి నుండి.... ఇప్పటి దాక...
నాతోనే... ఉన్నావు.
నాకంటూ ఏదీ... లేని క్షణంలో కూడా...
నా నీడవై వెన్నంటి ఉన్నావు.
"నా శ్వాస ఆగిపోతే
నేనే లేకపోతే" అన్నప్పుడు..
నీ ఆత్మనై నీ తోడుగా వస్తాలే అన్నావు...
ఓ... హితుడా...!
సన్నిహితుడా....!!
స్నేహితుడా......!!!
అందుకోవయ్య నా ఈ అక్షర నీరాజనం !!
నువ్వు ఎప్పటికీ...నా హృదయంలో పదిలం పదిలం !!!!
No comments:
Post a Comment