Monday, 16 April 2012

నేను....





సాహిత్య సౌరభాలు వెళ్లి  విరిసిన వనంలో
నేను ఒక సుమమై వికసించి
అణువణువునా మేఘాల చిత్రాల చీరను కట్టిన
ఆ...వినీలాకశంలో ఓ..చిత్రమై మెరిసి
జల తరంగ ధ్వనిని ప్రతిధ్వనించి
శృతి లయలు లేని కోయిల గొంతులో పాటని పల్లవించి
కళాకారుల స్వేచ్చను నేనై
ఓ...అద్భుత కళాసృష్టికి కర్తను నేనై
కళే న గుండె లయైపోవాలి
సప్తస్వరాలు నా కాలి మువ్వలై నర్తించి
నటరాజును అభిషేకించాలి
మరాళగామిని స్వరాల హరమై నేను మెరవాలి
         కానీ,నేను ఆర్టిఫిఫిశియాల్ పువ్వును
         నేను ఆకాశం దాక ఎగరలేను
         మేఘమై నిలువలేను
         కళాకారిణి కావాలని
         కల కనే ఓ...కళను నేను
         నా భావాలకు ఉన్న స్వేచ్చ నాకు లేదు.

No comments: