ప్రియా....!
సూర్యుడు చూడక ముందే
నన్ను నువ్వు చూడాలి..
నా ముంగురుల పరదాలను తీస్తూ...
నువ్వు పిలిచే పిలుపే
నాకు సుప్రభాతం పాడాలి.....
తొలి కిరణాల వెచ్చదనం కన్నా ముందే
నీ కౌగిలి వెచ్చదనం తనువుని తాకాలి...
కాఫీ పరిమళం రుచి చూడక ముందే
నీ పెదాల రుచి నాకు తెలియాలి....
నువ్వు చెప్పే ఐ లవ్ యు తోనే
నాకు ఉషోదయం కావాలి....!!
No comments:
Post a Comment