Thursday, 19 April 2012

అద్రుస్టమే అద్రుస్టం….!!

అద్రుస్టమే అద్రుస్టం….!!!
నీ చేతి వాచీ దే అద్రుస్టం…..!!
ఆ వాచి నైన కాకపోతిని…
నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాన్ని…
అప్పుడప్పుడైన నన్ను చూసే దానివి…!!!
అద్రుస్టమే అద్రుస్టం!!
నీ పాకెట్ లోని పెన్ దే అద్రుస్టం..!!
ఆ పెన్ నైన కాకపోతిని….
నీ గుండే పై ఉండే వాన్ని…..!
నీ మనసు భావాన్ని నా సిరా తో రాసే దానివి…!!
అద్రుస్టమె అద్రుస్టం…!!
నీ హ్యండ్ కర్చీఫ్ దే అద్రుస్టం…!!
ఆ కర్చీఫ్ నైన కాకపోతిని…
నీ కస్టాన్ని తుడిచే వాన్ని…..
నీ చేతులలో నన్ను నలిపే దానివి…!!
అద్రుస్టమే అద్రుస్టం…!!
నీ సెల్ ఫోన్ దే అద్రుస్టం…!!
ఆ సెల్ ఫోన్ నైన కాకపోతిని….
నీ పెదవులకు చేరువయ్యే వాన్ని…
నీ మాటల మధురిమ నాలొ పలికించే దానివి… 

No comments: