శాశ్వతం కాదు ఏది
ఈ చిన్ని జీవితంలో …
జీవితం అను ఈ పద్మవ్యూహం ...
అంతు తెలియని మలపుల సారం …
ఈ భూప్రపంచాన ..నీది అన్నది ఏది లేదు
అది స్నేహమైనా ...ప్రేమ ఐనా ….…
దేనిని ఎవరిని నీది అనుకోకు …..అనుకుని మోసపోకు …మోసపోయి దిగులుపడకు …
కావాలి జీవితం లో ప్రతి ఘట్టం ఒక గుణపాఠం …
నేర్చుకో వాటినుండి జీవిత సత్యం …
ప్రాణ స్నేహితులైనా కాని రారు నీతో జీవితాంతం …
కాని నీ శ్రమ వచ్చును నీతో అడుగడుగునా ….
నీ కష్టమే నీ ప్రాణ స్నేహితుడనుకుని జీవించు …
అవరోధాలను ఎదుర్కొన గల శక్తిని ఆత్మస్థ్యర్యాన్ని అది నీకు ఇచ్చును …
నిన్ను ఉన్నత శిఖరముపై కూర్చుండబెట్టును …
ఆ సమయాన నీ ప్రమేయం లేకుండానే ఈ ప్రపంచాన అందరు నీ స్నేహితులవుదురు...
No comments:
Post a Comment